img

TANA PSV - Nov 29th event - Press Release

img
img
Dec 29, 2020

Description

తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో అమెరికాలో “తెలుగు పద్య వైభవం” న్యూ యార్క్: తానా ప్రపంచ సాహిత్య వేదిక ప్రతి నెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయ దృశ్య సాహిత్య సమావేశం జరుపుతోందని, దీనిలో భాగంగా ఆదివారం, నవంబర్ 29 వ తేదిన, భారత కాలమానం రాత్రి 8:30 కు, “తెలుగు పద్య వైభవం” అనే అంశంపై ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్, నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర ఆధ్వర్యం లో జరుగనున్నట్లు తానా అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి ప్రకటించి అందరకీ ఆహ్వానం పలికారు.

తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ఈ ఏడవ సాహితీ సమావేశంలో మహాసహస్రావధాని డా. గరికిపాటి నరసింహారావు ముఖ్య అతిధిగా హాజరై తెలుగు పద్య వైభవం పై కీలకోపన్యాసం చేస్తారని, అంతేగాక అమెరికాలో పుట్టి పెరుగుతున్న తెలుగు సంతతికి చెందిన 30 మందికి పైగా బాల బాలికలచే తెలుగు పద్య గానలహరి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అన్నారు. లిటిల్ మ్యుజీషియన్స్ అకాడమీ అధినేత, నేపధ్యగాయకుడు కొమండూరి రామాచారి శిక్షణ లో ఉన్న విద్యార్ధులు వేమన శతకం, దాశరధి శతకం, సుమతీశతకం పద్యాలను, కీర్తన అకాడమీ అధినేత, సంగీత దర్శకుడు నేమాని పార్థసారధి శిక్షణలో ఉన్న విద్యార్ధులు భాగవత పద్యాలను, పలు నంది అవార్డుల పురస్కార గ్రహీత, ఆంధ్రప్రదేశ్ పూర్వ నాటక అకాడమీ ఛైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ శిక్షణలో ఉన్న విద్యార్ధులు పౌరాణిక పద్యాలాపన చేస్తారని డా. ప్రసాద్ తోటకూర తెలియజేశారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాహితీ ప్రియులందరూ ఈ కార్యక్రమాన్ని నవంబర్ 29 వ తేదిన (భారత కాలమానం – 8:30 PM; అమెరికా - 7 AM PST; 9 AM CST; 10 AM EST)

  1. Facebook: https://www.facebook.com/tana.org
  2. 2. YouTube: https://www.youtube.com/channel/UCwLhSy1ptf0i1CioyeZmzrw
  3. వీక్షించ వచ్చని, మిగిలిన వివరాలకు: www.tana.org ను సందర్శించవచ్చు.
img

jOIN TANA TODAY

Let us join hands to address the needs of the Telugu Community globally.

© 2022 TANA Events. All rights reserved.

KEEP IN TOUCH